భారత్-కివీస్ రెండో వన్డే: కీలక మ్యాచ్‌లో బౌలింగ్ ఎంచుకున్న భారత్!

  • రెండేసి మార్పులతో బరిలోకి దిగుతున్న ఇరు జట్లు
  • షమీ, కుల్దీప్‌‌ల స్థానంలో సైనీ, చాహల్
  • ఇరు జట్లకు కీలకంగా మారిన మ్యాచ్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో నేడు జరగనున్న కీలకమైన రెండో వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ వన్డే ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. తొలి వన్డేలో విజయం సాధించిన న్యూజిలాండ్ ఈ వన్డేనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు, తొలి వన్డేలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన గట్టి పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.

త్వరలో జరగనున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి నవదీప్ సైనీకి అవకాశం కల్పించారు. తొలి వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్న కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కింది. న్యూజిలాండ్ కూడా రెండే మార్పులతో క్రీజులోకి దిగుతోంది. మిచెల్ శాంటర్న్ స్థానంలో మార్క్ చాంప్‌మన్, ఇష్ సోధీ స్థానంలో కైల్ జెమీసన్‌కు తుది జట్టులో చోటు దక్కింది.
Go Back to Shorts
India
Team New Zealand
one day
Virat Kohli

More Telugu News